`మీరో చెత్త ప్రొడక్ట్`.. సీఎంపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు!

October 26, 2020 at 2:04 pm

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై వివాస్ప‌దంగా మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తున్న కంగ‌నా.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనవారు ముంబైకి వ‌చ్చి డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఉద్ధవ్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు.

ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నా రాష్ట్రంలో నాకు తిండి కూడా దొరకదని అన్నారు. కానీ, హిమాలయాల అందం ప్రతి భారతీయుడికి ఎలా చెందుతాయో, ముంబై అందించే అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయంటూ కౌంటరిచ్చారు. నాకు మీ కొడుకు వయసుంటుంది.

స్వయం ప్రతిభతో ఎదిగిన ఒంటరి మహిళ గురించి ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గు వేస్తోంద‌ని కంగ‌నా ఫైర్ అయింది. ముఖ్యమంత్రి గారూ.. మీరు ఓ చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్ అని కంగ‌నా ఫైర్ అయింది. ఆ త‌ర్వాత మ‌రో ట్వీట్‌లో `సీఎంగారు.. మీలాగా తండ్రి పవర్ ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి రాలేదు.. నేను కూడా గొప్ప కుటుంబానికి చెందినదాన్నే.. వాళ్ల సంపదపై ఆధారపడి జీవించాలనుకుంటే.. అక్కడే ఉండేదాన్ని` అని కంగ‌నా చెప్పుకొచ్చింది. మొత్తానికి కంగ‌నా వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

 

`మీరో చెత్త ప్రొడక్ట్`.. సీఎంపై కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts