కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా కు వార్నింగ్.. అత్యాచారం చేస్తామంటూ..?

October 21, 2020 at 5:58 pm

బాలీవుడ్లో కాంట్రవర్షియల్ బ్యూటీగా ఎంతగానో క్రేజ్ సంపాదించి ప్రస్తుతం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది కంగనారనౌత్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్న నాటినుంచి సోషల్ మీడియాలో ఎప్పుడూ నానుతూనే ఉంది ఈ అమ్మడు. అయితే ఇటీవలే ఏకంగా రాజకీయంగా కూడా కంగనా పలు వివాదాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తన బ్రదర్ మ్యారేజ్ పనుల్లో బిజీ బిజీగా ఉంది.

దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంది కంగనారనౌత్. ఇదిలా ఉంటే ఇటీవలే ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది తన ఫేస్ బుక్ పేజీలో సంచలన కామెంట్ చేశాడు. కంగన ఇప్పటికైనా నీ ఓవరాక్షన్ ఆపు లేకపోతే నడిరోడ్డు పైన అత్యాచారం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత స్పందించిన సదరు లాయర్ తాను తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తన అకౌంట్ ను హ్యాక్ చేసి ఉంటారని వివరణ ఇచ్చాడు. ఎవరి మనోభావాలైనా దెబ్బ తింటే క్షమించాలని కోరాడు.

కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా కు వార్నింగ్.. అత్యాచారం చేస్తామంటూ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts