రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ…

October 15, 2020 at 6:27 pm

ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టం వాటిల్లిందని…కేంద్రం తక్షణం స్పందించి సాయం చేయాలని లేఖలో కోరారు. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దంచికొట్టిన వానల కారణంగా…ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు చెప్పారు సీఎం. దీంతో వెంటనే సహాయక, పునరావాస చర్యల కోసం వెంటనే రూ. 1350 కోట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరారు.

ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా వరకు కాలనీలు నీటమునిగాయని… మూసీ ఎన్నడూ లేనంతగా ఉప్పొంగడంతో జనజీవనం స్థంబించిందని తెలిపారు. నగరంలో వేలాది మంది నిరాశ్రయులయ్యారని వీరందరికీ తక్షణ సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేసీఆర్ చేప్పారు. ప్రకృతి విపత్తు కింద సాయం చేయాలని కోరారు కేసీఆర్.

రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts