కేసిఆర్ మాట విన్న.. నష్టాల్లో కూరుకుపోయా..?

October 26, 2020 at 6:18 pm

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే ఈ వర్షాకాలం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆనంద పడిపోయిన రైతులందరికీ మళ్లీ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగి మళ్లీ నిరాశే ఎదురయ్యింది అని చెప్పాలి.

అయితే వర్షాకాలం కేసీఆర్ సర్కార్ రైతులు ఏ పంట వేసుకోవాలి అనేదానిపై రైతులకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్కు బాధలు చెప్పుకుంటూ ఆవేదన చెందుతున్న ఓ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కరీంనగర్కు చెందిన రైతు పంట నష్ట పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట విని సన్న రకం వరి పండించానని భారీ వర్షాల కారణంగా పంట మొత్తం నాశనం అయిందని.. ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి చేస్తూ రైతు వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

కేసిఆర్ మాట విన్న.. నష్టాల్లో కూరుకుపోయా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts