చిరుకి చెల్లెలు సెట్టైందోచ్‌.. సెలెక్ష‌న్ అదిరిపోయిందిగా!

October 28, 2020 at 8:37 am

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజివి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇందులో కూడా ఓ ఊరి కోసం.. గుడి కోసం పోరాడే నాయకుడిగా నటిస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రంతో పాటు చిరు ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లో కూడా న‌టించ‌నున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం కానుంది.

దీంతో ఆ సిస్టర్ క్యారెక్టర్‌లో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ చెల్లెలుగా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ ప్రచారం నిజం అని తేలింది. తాజాగా కీర్తి సురేష్‌ను చిరు ఎంపిక చేశారని తెలిసింది​. దీనిపై చర్చలు కూడా జరిగాయట.

త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టీ నగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో అన్నా చెల్లెళ్లుగా చిరు, కీర్తిల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. కీర్తి సురేష్‌.. ఈమె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌హాన‌టి చిత్రంలో కీర్తి సావిత్ర‌గా ఒదిగిపోయిన తీరు అంద‌రినీ ఎంతగానో ఆక‌ట్టుకుంది. అలాంటి కీర్తిని చిరుకి చెల్లెలుగా ఎంచుకోవ‌డం బెస్ట్ సెలెక్ష‌న్ అనే చెప్పాలి.

చిరుకి చెల్లెలు సెట్టైందోచ్‌.. సెలెక్ష‌న్ అదిరిపోయిందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts