కేజీఎఫ్ హీరోతో పూరి జ‌గ‌న్నాథ్ సినిమా..?

October 13, 2020 at 4:14 pm

కేజీఎఫ్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా స్టార్ డ‌మ్‌ను సంపాదించుకున్నారు క‌న్న‌డ హీరో యశ్. ఆ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా కోసం ఇప్పుడు సౌత్ ఇండియానే దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారంటే ఆ సినిమా ప్ర‌భావం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కె.జి.ఎఫ్ సినిమాతో యశ్ సౌత్ సెన్సేషనల్ స్టార్ గా ఎదిగాడు. కన్నడలోనే కాదు తెలుగు, తమిళం, హిందీ ప్రేక్ష‌కుల అభిమానాన్ని సైతం పొందారు. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతున్న‌ది. క‌రోనాతో వాయిదాప‌డిన చిత్రీక‌ర‌ణ తాజాగా మొద‌లైంది. కె.జి.ఎఫ్ -2 సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండ‌గా.. కేజీఎఫ్ త‌రువాత యశ్ ఏ సినిమా చేస్తాడు ? అన్న అంశంపై సినీవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం. యశ్ తో తెలుగు స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ సినిమాను ప్లాన్ చేశాడ‌ని స‌మాచారం. సుదీర్ఘ విరామం త‌రువాత రామ్ హీరోగా డైరెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న పూరీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వరలోనే మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తో పూరీ సినిమా చేస్తాడని టాలివుడ్ టాక్. య‌శ్‌ ఇమేజ్ కు సరిపడే కథ ఒకటి సిద్ధం చేసుకున్నాడట. ఫైటర్ ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న పూరి, ఆ తర్వాత యశ్ తో చేసే సినిమానూ అదేస్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు విష‌యం సినీవ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతున్న‌ది. ఇదిలా ఉండ‌గా కేజీఎఫ్‌ను డైరెక్ట్ చేసిన ప్ర‌శాంత్ నీల్ ఆ త‌రువాత తెలుగు అగ్ర‌హీరోతో ఓ సినిమాను ప్లాన్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తుండ‌డం విశేషం.

కేజీఎఫ్ హీరోతో పూరి జ‌గ‌న్నాథ్ సినిమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts