హైస్కూల్‌ రోజుల్లోనే కియారా ప్రేమాయణం.. షాక్‌లో ఫ్యాన్స్‌!

October 22, 2020 at 8:45 am

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న కియారా.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్‌ అనే నేను` సినిమాతో తెలుగు‌ ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. ఆ త‌ర్వాత వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కూడా ఈ అమ్మ‌డు న‌టించి మెప్పించింది.

ఇక ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీ హీరోయిన్ల‌లో ఈమె కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం కియారా న‌టించిన లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ షేర్ షా సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మ‌రోవైపు బుల్ భులయ్యా 2 లో కూడా ఈమె న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న కియారా హైస్కూల్‌ రోజుల్లోని తన ప్రేమాయణం గురించి చెప్పి అభిమానులు షాక్‌కి గురిచేసింది.

ఆమె మాట్లాడుతూ.. ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని అమితంగా ఇష్ట‌ప‌డ్డాను. వీకెండ్ వ‌చ్చిందంటే ఇంట్లో వాళ్లకి అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. దీంతో చదువును అశ్రద్ధ చేస్తున్నానని నా పేరెంట్స్ కోప్పడేవారు. అప్పుడు చదువా? ప్రేమా? అన్న సంఘర్షణ పడి చివరికి ప్రేమను వ‌దులుకున్నాను. ఈ స‌మ‌యంలో నేను చాలా కృంగిపోయాను. కానీ వయసు పరిపక్వతతో త్వరగానే కోలుకున్నా`నని కియారా చెప్పుకొచ్చింది. మొత్తానికి హైస్కూల్‌ రోజుల్లోనే కియారా ప్రేమాయణం న‌డిపింద‌న్న‌మాట‌.

హైస్కూల్‌ రోజుల్లోనే కియారా ప్రేమాయణం.. షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts