43 సంవత్సరాలు పూర్తి చేయకున్నా కృష్ణం రాజు, కృష్ణ సినిమా

October 19, 2020 at 6:04 pm

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటితో వీరిద్దరూ కలిసి నటించిన ” మనుషులు చేసిన దొంగలు ” చిత్రం విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకి ఎం మల్లికార్జున రావు దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా చేసుకొని సినిమా పోస్టర్ను షేర్ చేశారు.

అంతే కాకుండా ఈ సినిమా చేయడం ద్వారా నేను సూపర్ స్టార్ కృష్ణ కు చాలా దగ్గర అయ్యానని కొనియాడారు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు అయింది ఎన్నో గొప్ప మధురమైన అనుభవాలను మిగిల్చింది అంటూ కృష్ణం రాజ్ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది అని సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

43 సంవత్సరాలు పూర్తి చేయకున్నా కృష్ణం రాజు, కృష్ణ సినిమా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts