ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో సీత‌గా మహేష్ హీరోయిన్‌?

October 17, 2020 at 9:56 am

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రోజెక్ట్స్‌లో `ఆదిపురుష్‌` కూడా ఒక‌టి. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీసిరీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కిస్తుండగా.. మిగిలిన భారతీయ భాషల్లో కూడా డబ్‌ అవ్వనుంది. రామాయణం ఆధారంగా తెర‌కెక్క‌బోతున్న‌‌ ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్‌ రాముడి ప్రాతలో కనిపించనుండగా.. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణుడి పాత్ర పోషించనున్నారు.

Kriti Sanon's Tollywood debut with '1: Nenokkadine' opposite Mahesh Babu;  read | Regional News | Zee News

ఈ క్రమంలో మిగిలిన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న చర్చ ఫిలింనగర్‌ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ప్ర‌భ‌స్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే కీర్తి సురేశ్ నటిస్తుందని, అనుష్క శర్మ నటిస్తుందని, కాదు కైరా అద్వానీ అంటూ ఇప్పటికే కొన్ని పేర్లు ప్రచారంలోకి వ‌చ్చాయి.

Adipurush': Kriti Sanon in consideration to play the leading role opposite  Prabhas? | Telugu Movie News - Times of India

అయితే తాజాగా సామాచారం ప్ర‌కారం.. మ‌హేష్ 1-నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. కృతినే ప్ర‌భాస్‌కు సెట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావించి.. ఆమెను ఫిక్స్ చేసిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`లో సీత‌గా మహేష్ హీరోయిన్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts