లావణ్య త్రిపాఠి న్యూ లుక్.. మల్లిక పాత్ర లో అందాల రాక్షసి..?

October 24, 2020 at 3:59 pm

అందాల రాక్షసి సినిమా తో కొంటె పిల్ల పాత్రలో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాటి. ఇక ఆ తర్వాత తన అందంతో చిరునవ్వుతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించటమే కాదు దర్శక నిర్మాతలను కూడా ఆకర్షించి అవకాశాలను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలకు ఇటు జూనియర్ హీరోలకు కూడా పర్ఫెక్ట్ జోడీగా పేరుతెచ్చుకున్న లావణ్య త్రిపాటి ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం ఆర్ఎక్స్ 100తో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో చావు బతుకు చల్లగా అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన హీరోయిన్గా నటిస్తోంది లావణ్య త్రిపాఠి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ఈ టీజర్ ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ఫస్ట్ లుక్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తుంది లావణ్య త్రిపాఠి.

లావణ్య త్రిపాఠి న్యూ లుక్.. మల్లిక పాత్ర లో అందాల రాక్షసి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts