ఆ సినిమాతో మ‌రోసారి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన మ‌హేష్‌!

October 23, 2020 at 7:38 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించింది. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. బాక్సాఫిస్ వ‌ద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. సూపర్‌ స్టార్‌ కామెడీ టైమింగ్‌కు యూత్‌ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా బాగా కనెక్ట్ అవ్వటంతో సినిమా భారీ వసూళ్లు సాధించింది.

దిల్‌ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో దద్దరిల్లిందో అదే విధంగా తెలుగు స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే స్థాయిలో భారీ టీఆర్పి రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం మూడో సారి టెలికాస్ట్ కాగా.. మ‌ళ్లీ బారీ రేంటింగ్స్ వ‌చ్చాయి.

గత వారం జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ చేయబడిన ఈ చిత్రానికి 12.55 టీఆర్పి రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మూడో సారి టెలికాస్ట్ అయిన‌ప్ప‌టికీ.. ఈ స్థాయిలో రికార్డ్స్ రావ‌డం ఒక రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పి నే అని ఇండస్ర్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు `సర్కారు వారి పాట` సినిమాలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాతో మ‌రోసారి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన మ‌హేష్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts