కీర్తి సురేష్‌కు వెల్కమ్ చెప్పిన‌ మహేష్.. ఖుషీలో ఫ్యాన్స్‌!

October 17, 2020 at 11:23 am

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న కీర్తి సురేష్‌.. పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ అంటూ ఎప్ప‌టి నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, దీనిపై మేక‌ర్స్ మాత్రం స్పందించ‌లేదు. అయితే నేడు కీర్తి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆమెకు మ‌హేష్ బాబు విషెస్ తెలిపి `సర్కారు వారి పాట` లోకి వెల్కమ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు.

`హ్యాపీ బర్త్‌డే కీర్తి. నీకు సర్కారు వారి పాటలోకి టీమ్ వెల్క‌మ్ చెబుతోంది. నీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది` అని మహేష్.. కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ఇక మ‌హేష్ సినిమాలో కీర్తి ఫిక్స్ కావ‌డంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, కీర్తి సురేష్ మ‌రోవైపు నితిన్‌తో రంగ్‌దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్ర‌ల్లో న‌టిస్తోంది.

 ప్రస్తుతం నితిన్‌కు జోడిగా 'రంగ్‌దే'లో నటిస్తోన్న కీర్తి మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  ఈరోజు కీర్తి సురేష్ తన 28వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ ప్రకటన చేసింది. ఇక  కీర్తి ఇతర సినిమాల విషయానికి వస్తే..

కీర్తి సురేష్‌కు వెల్కమ్ చెప్పిన‌ మహేష్.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts