మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డ్.. చివరికి..?

October 12, 2020 at 5:48 pm

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని ఘటనలు తెరమీదికి వస్తుండటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలు రోజురోజుకీ తెర మీదికి వస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.

ఇక తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీ కి వెళ్తున్న మైనర్ బాలికను అడ్డగించి 12 మంది విద్యార్థులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ సిప్రి బజార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్తున్న బాలికను 12 మంది విద్యార్థులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒకరు అత్యాచారం చేయగా మిగతా వాళ్ళందరూ సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించి ఏకంగా రెండు వేల రూపాయలు లాక్కున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వాపోయింది బాధితురాలు.

మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డ్.. చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts