కోడికూర వండని భార్య‌.. భ‌ర్త ఏం చేశాడో తెలిస్తే షాకే!

October 28, 2020 at 11:17 am

ఇటీవ‌ల కాలంలో ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. ప‌నికి రాని కార‌ణాల‌కు కూడా చంపుకునే వ‌ర‌కు వెళ్తున్నారు. తాజాగా ఓ భ‌ర్త.. కోడికూర వండ‌లేద‌ని భార్య‌నే హ‌త‌మార్చారు. ఈ దారుణ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో సన్నయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు నివ‌సిస్తున్నారు.

అయితే సోమ‌వారం నాడు చికెన్ తెచ్చి భార్య‌కు ఇచ్చి వండ‌మ‌ని పొలానికి వెళ్లాడు. అయితే సీత‌మ్మ చికెన్ వండ‌కుండా వేరే కూడా వండి తీసుకెళ్లింది. దీంతో కోడికూర వండలేదని కోపంతో స‌న్న‌య్య ఊగిపోయాడు. ఈ క్ర‌మంలోనే కోపోద్రిక్తుడైన సన్నయ్య.. భార్య‌ను చేతికి అందిన క‌ర్ర‌తో చిత‌క‌బాదాడు. ఆ దెబ్బల‌కు సీత‌మ్మ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది.

దీంతో భార్య మృతదేహాన్ని ఇంట్లో దాచి ఎవరికీ చెప్పకుండా స‌న్న‌య్య ప‌రార్ అయ్యాడు. అయితే ఆ త‌ర్వాత రోజు శవం నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు వ‌చ్చి చూడ‌గా.. అసలు విషయం బయట పడింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ప‌రారీలో ఉన్న స‌న్న‌య్య‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది.

కోడికూర వండని భార్య‌.. భ‌ర్త ఏం చేశాడో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts