మందుబాబులకు శుభవార్త.. ఇక పండగే.!

October 29, 2020 at 5:54 pm

రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు మద్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండని విధంగా భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సామాన్యులు మద్యం కొనాలి అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎక్కువ ధరలతో మద్యం కొనలేక ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే మద్యం ధరలు తగ్గించి అందరికి శుభవార్త చెప్పింది జగన్ సర్కార్.

ఇప్పుడు మరోసారి మద్యం ధరల పై కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. రాష్ట్రంలో మద్యం ధరలు ప్రభుత్వం మరోసారి సవరించింది. మీడియం ప్రీమియం లో 25 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది జగన్ సర్కార్. భారత్లో తయారయ్యే వివిధ విదేశీ బ్రాండ్ పై 25 శాతం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 50 రూపాయల నుంచి 1350 రూపాయల వరకు వివిధ కేటగిరీలలో ఉన్న బ్రాండ్ లపై ధరలు తగ్గే అవకాశముంది.

మందుబాబులకు శుభవార్త.. ఇక పండగే.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts