మందుబాబులకు షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

October 26, 2020 at 5:33 pm

జగన్మోహన్ రెడ్డి సర్కారు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. అయితే మద్యం అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను ఏపీకి తెచ్చుకునేందుకు అవకాశం ఉంది అంటూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఏపీకి యథేచ్చగా తెచ్చుకుంటున్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను ఏపీకి తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. పర్మిట్ లేకుండా మద్యం తెచ్చేందుకు వీల్లేదు అంటూ స్పష్టం చేసింది. అంతే కాకుండా విదేశాల నుంచి మద్యం ఏపీకి తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే అనుమతి ఇస్తాము అంటూ తెలిపేందుకు.

మందుబాబులకు షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts