మరోసారి హై కోర్టు మెట్లెక్కిన టీటీడీ వ్యవహారం..?

October 17, 2020 at 6:34 pm

ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు దేవాలయ ఆస్తుల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారణే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. టీటీడీ బోర్డు దేవాలయ ఆస్తులన్నింటినీ పక్క దారి పట్టిస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి టీటీడీ వ్యవహారం హై కోర్టు మెట్లెక్కింది.

ఇప్పటికే టీటీడీ బోర్డు దేవాలయ ఆస్తులను పక్కదారి పట్టేస్తుంది అనే ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి ఇదే విషయంపై మరో పిటిషన్ కూడా దాఖలయింది. బీజేపీ నేత టీటీడీ మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేవస్థానం నిధులతో బాండ్ల కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అధిక వడ్డీ పేరుతో టీటీడీ బాండ్ల కొనుగోలు సరైనది కాదు అంటూ తెలిపిన భాను ప్రకాష్ రెడ్డి… టిటిడి నిధులను పక్కదారి పడుతున్నాయి అంటూ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారిపోయింది.

మరోసారి హై కోర్టు మెట్లెక్కిన టీటీడీ వ్యవహారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts