మాస్క్ ఇప్పుడు అతి తక్కువ ధరకే..?

October 21, 2020 at 4:40 pm

ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మాస్క్ వాడటం ఎంత అనివార్యంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరూ తప్పనిసరిగా మాస్క్ వాడాలి అంటూ సూచనలు సలహాలు కూడా చేస్తున్నాయి ఈ క్రమంలోనే మార్కెట్లో ఎన్నో సరికొత్త మాస్క్ లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో మాస్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మాస్కుల ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని మాస్కుల ధర నిర్ణయించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. రెండు లేదా మూడు పొరలు మాస్కులను కేవలం మూడు లేదా నాలుగు రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్95 మాస్క్ లను నాణ్యతను బట్టి 19 లేదా నలభై ఐదు రూపాయల లోపు విక్రయించాలని.. రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమలులో ఉన్నన్ని రోజులు అందరూ మాస్కులకు ఈ ధరలు మాత్రమే కొనసాగించాలంటూ మహా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు.

మాస్క్ ఇప్పుడు అతి తక్కువ ధరకే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts