మెగా కుటుంబంలో మ‌ళ్లీ పెళ్లిసంద‌డి..!

October 17, 2020 at 6:10 am

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఒక‌రి పెళ్లి ఫిక్ష‌యింది. సైరా న‌ర‌సింహారెడ్డి సిన్మాలో మెరిపించి మురిపించిన నాగ‌బాబు త‌న‌య నిహారికకు ఓ బిజ్‌నెస్ మ్యాన్‌కు ఆగ‌స్టులో నిశ్చితార్థ వేడుక అంగ‌రంగ‌వైభంగా నిర్వ‌హించింది మెగా ఫ్యామిలీ. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో వారి వివాహం జ‌రింపేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా టాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం ఏమిటంటే మెగా కుటుంబంలో మ‌రో వివాహం కూడా జరిగేలా ఉంద‌ని తెలుస్తున్న‌ది. ఇంత‌కి ఎవ‌రిదా అంటే ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అని ఎంజాయ్ చేస్తోన్నసాయి తేజ్‌ది అంటూ స్వీట్‌ షాక్ ఇచ్చారు చిరంజీవి.

అస‌లు విష‌యం ఏమిటంటే.. గ‌త గురువారం రోజున సాయితేజ్‌ బర్త్ డేను జ‌రుపుకున్నాడు. 34వ ప‌డిలోకి ప‌డిపోయాడు. ఈ సందర్భంగా మేన‌ల్లుడిని విష్ చేస్తూ సోష‌ల్‌మీడియాలో ఓ పోస్టును పెట్టాడు. చిరు. అది ఇక ఎలా ఉందంటే బ్యాచిలర్ లైఫ్‌కి శుభం కార్డ్‌ పడే టైమ్‌ వచ్చిందనే సంకేతాలు ఇచ్చిన‌ట్లు ఉండ‌డంతో ఆ పోస్టు ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే కొద్దిరోజు ముందు నుంచే సాయి తేజ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చేసిన పోస్ట్ అందుకు బ‌లం చేకూర్చుతున్న‌ది. దీంతో తేజుకి పెళ్లి ఘడియలు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని సినీజ‌నాలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ మెగా మేనల్లుడు నిజంగా పెళ్లిచేసుకోబోతున్నాడా.. లేక పుకార్లేనా అని తెలియాల్సి ఉంది. మరి తేజు త‌న త‌రువాతి పుట్టిన రోజుక‌ల్లా భర్త హోదా అందుకుంటాడా..? లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడా..? లేక అరేంజ్డ్‌ మ్యారేజా చేసుకుంటాడా? అనే చ‌ర్చ‌కూడా సాగుతుండ‌డం విశేసం. ఇటీవ‌లే లాక్‌డౌన్ స‌మ‌యంలోనే హీరో రానా, నితిన్‌ భర్తలుగా మారిపోయారు. ఇప్పుడు సాయి తేజ్‌ కూడా పెళ్లికి సిద్ధ‌ప‌డితే టాలీవుడ్‌ బ్యాచిలర్‌ క్లబ్‌లో మరో వికెట్‌ డౌన్ అయిన‌ట్లేన‌ని ప్రచారం జరుగుతోంది.

మెగా కుటుంబంలో మ‌ళ్లీ పెళ్లిసంద‌డి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts