నేను యోధుడిని కాదు.. ఓ రోగిని : మెగా హీరో

October 28, 2020 at 5:27 pm

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే . ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఆ తర్వాత నాగబాబు కరోనా నుంచి కోలుకున్నట్టు అదే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు ప్రేక్షకులకు తెలియజేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. నేను కరోనాను జయించిన యోధుడిని కాదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఒక రోగిని అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. అంతేకాదు ఆయనకు ఎన్నో ఏళ్లుగా ఆస్తమా ఉందని, అదే సమయంలో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎంతో ఆందోళన చెందాను అన్నారు. వెంటనే ట్రీట్‌మెంట్ కోసం ఓ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చేరాను. కొన్ని సార్లు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డనన్నారు. కరోనా వచ్చిన మూడో రోజులకు నేను వాసన గుర్తించే లక్షణాన్ని కూడా కోల్పోయినట్టు చెప్పారు.

డాక్టర్స్ ఇచ్చిన మెడిసన్స్‌ను టైమ్ ప్రకారం వేసుకోవడంతో కొన్ని రోజుల్లోనే కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చానని, ఇంటికి వచ్చాక మరో వారం రోజుల పాటు తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.అదే సమయంలో ఇంట్లో తన శ్రీమతి పద్మజకు కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. దీంతో మేమిద్దరం స్వీయ గృహనిర్భంధంలో ఉన్నట్టు తెలిపారు.అయితే నాకు ఆస్తమా ఉండడం వల్ల నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోండి.ఇంట్లో వాళ్లతో పాటు మిగతా వాళ్లను కూడా కరోనా బారిన పడకుండా రక్షించవచ్చు అన్నారు.. !!

నేను యోధుడిని కాదు.. ఓ రోగిని : మెగా హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts