చిరు మూవీ మ‌రింత ఆల‌స్యం..?

October 17, 2020 at 6:29 am

మెగాస్టార్ చిరంజీవి ఏ క్ష‌ణంలో ఆచార్య మూవీని మొద‌లు పెట్టారో కానీ అస‌లు ఆ ప్రాజెక్టు ఏ కోశానా ముందుకు సాగ‌డం లేదు. అనుకోని విధంగా అనేక అవాంత‌రాలు వ‌చ్చిన‌ప‌డుతున్నాయి. సినిమా చిత్రీక‌ర‌ణ రోజురోజుకూ ఆల‌స్యమ‌వుతున్నంది. “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అతిథిగా హాజ‌రైన సంద‌ర్భంగా ‘ఆచార్య’ చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తిచేయాలని దర్శకుడు కొరటాల శివ నుంచి మాట తీసుకున్నారు చిరంజీవి. ఈ సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ చిత్రం ప్రారంభమైనా ఇక ఒక్క అడుగు కూడా ముందుకు సాగ‌డం లేదు. ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుండీ హీరోయిన్ త్రిష తప్పుకోవ‌డంతో కొద్దిరోజులు చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. ఆ తరువాత కరోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో దాదాపు 6 నెల‌లుగా మూవీల షూటింగ్లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల సినిమా షూటింగ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వ‌డంతో అనేక సినిమాలు సెట్స్‌కు మీద‌కు వెళ్లాయి. ప‌లువురు అగ్ర‌తార‌లు కూడా చిత్రీక‌ర‌ణ‌ల్లో పాల్గొంటున్నారు. అయితే ఇ‌ప్ప‌టికీ ‘ఆచార్య’ టీం ఆ దిశ‌గా అడుగులు వేయ‌క‌పోవ‌డం గ‌మనార్హం. వాస్తావానికి దసరా నుంచి తిరిగి ఆచార్య షూటింగ్ ను ప్రారంభించాల‌ని దర్శకనిర్మాతలు బావించార‌ట‌. కానీ సెట్స్ మీద‌కు వ‌చ్చేందుకు చిరంజీవి ప్ర‌స్తుతం అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని టాలివుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్పుడున్న క‌రోనా పరిస్థితిని బట్టి చూస్తుంటే మ‌రికొంత స‌మ‌యం తీసుకోవాల‌ని మెగాస్టార్ భావిస్తున్నార‌ట‌. ఏకంగా మరో రెండు నెలలు ఆగుదాం’ అని ఏకంగా దర్శకుడితో చెప్పిన‌ట్లు తెలుస్తుంది. అలా అయితే ‘ఆచార్య’ వేస‌వినాటికి కూడా రావడం కష్టమేన‌ని సినీవ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. మ‌రోవైపు మెగా సినిమా ఎప్పుడు వ‌స్దుందా? అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరు.. మెహర్ రమేష్ తో ‘వేదాలం’ రీమేక్, అలాగే వినాయక్ తో ‘లూసిఫర్’ రీమేక్… ఆ త‌రువాత బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉండ‌డం విశేషం. అవికూడా ఆల‌స్యంగానే ప‌ట్టాలు ఎక్కేలా క‌న‌బ‌డుతున్న‌ది. ఏమ‌వుతుందో చూడాలి మ‌రి.

చిరు మూవీ మ‌రింత ఆల‌స్యం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts