ఎంత‌కీ త‌గ్గ‌ని‌ దగ్గు.. ట్రంప్ శ్రీ‌మ‌తికి గోల్డెన్ చాన్స్ మిస్!

October 21, 2020 at 11:00 am

అతి సూక్ష్మజీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎవ‌రీ వ‌దిలిపెట్టడం లేదు. ఇటీవల అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆయ‌న స‌తీమ‌ణి మెలానియా ట్రంప్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే మెరుగైన చికిత్స అందించ‌డంతో ఇద్ద‌రూ క‌రోనా నుంచి కోలుకున్నాడు.

అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత మెలానియా తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ద‌గ్గు వ‌ల్లే మెలానియా గోల్డెన్ చాన్స్ మిస్‌ అయ్యారు. కరోనా వైరస్ బారిన పడిన ఆమె, కోలుకుంటున్నప్పటికీ.. విపరీతంగా దగ్గుతూ ఉండటంతో ఆమె నేడు పెన్సిల్వేనియాలో జరగనున్న ర్యాలీకి భర్త ట్రంప్ తో కలిసి వెళ్లాల్సిన అరుదైన అవకాశాన్ని వదులుకున్నారని స్టెఫానీ గ్రిషామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు ఆమె పెన్సిల్వేనియాకు వెళ్లి ఉంటే.. దాదాపు సంవత్సరం తరువాత భర్తతో కలిసి ఓ ర్యాలీలో పాల్గొన్నట్లయ్యేది. కాగా, వైరస్ నుంచి మెలానియా ట్రంప్ ఆరోగ్యం రోజురోజుకూ చక్కబడుతోంది. కానీ దగ్గు మాత్రం తగ్గడంలేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆమె తన ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని స్టెఫానీ తెలిపారు.

ఎంత‌కీ త‌గ్గ‌ని‌ దగ్గు.. ట్రంప్ శ్రీ‌మ‌తికి గోల్డెన్ చాన్స్ మిస్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts