ఒక్క‌రి కోసం ప్ర‌త్యేక రైలును న‌డిపిన మెట్రో

October 17, 2020 at 9:16 am

క‌రోనా నేప‌థ్యంలో స‌ర్వీసులు నిలిచిపోవ‌డంతో హైద‌రాబాద్ మెట్రో భారీ మొత్తంలోనే న‌ష్ట‌పోయింది. ఏకంగా 900కోట్ల‌కు పైగానే న‌ష్టాన్ని చ‌విచూసింది. ఈ మేర‌కు మెట్రో ఎండీ తాజాగా ప్ర‌క‌టించారు. ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన‌ప్ప‌టికీ మాన‌వ‌త‌ను చాటుకుని శేభాష్ అనిపించుకున్న‌ది. ఓ గ‌ర్భిణి కోసం ఏకంగా ప్ర‌త్యేకంగా ట్రైన్ స‌ర్వీసును న‌డిపి అండ‌గా నిలిచింది. మెట్రో ఉదార‌త‌పై నెటిజ‌న్లు ఇప్పుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఈ నెల 13.. రాత్రి 10 గంటలు. నగరమంతా భారీ వర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి. ఈ క్ర‌మంలో ఓ 8 నెలల గర్భిణి మియాపూర్‌ వెళ్లేందుకు అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లింది. అప్పటికే ట్రైన్లు నిలిపేయడంతో వెనక్కి వెళ్లాల్సిందిగా స్టేష‌న్ సిబ్బంది ఆమెకు సూచించారు. తాను ఎటూ వెళ్లే పరిస్థితిలో లేనని ఆ మ‌హిళ వేడుకోవడంతో సిబ్బంది చ‌లించిపోయారు. ఫోనులో వెంట‌నే మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి ప‌రిస్థితిని వివరించారు. స‌త్వ‌ర‌మే స్పందించిన ఆయన ప్ర‌త్యేక ట్రైన్ఆను వేయాల‌ని సూచించారు. ఆయ‌న ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ప్ర‌త్యేక రైలులో గర్భిణిని మియాపూర్‌ స్టేషన్‌కి చేర్చారు. విపత్తు వేళ‌ తనను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన మెట్రో సంస్థకు స‌ద‌రు గ‌ర్భిణి కృతజ్ఞతలు తెలిపింది. ఒక్క‌రి కోసంట్రైన్‌ నడుపడం దేశంలోనే ఫస్ట్‌ అని మెట్రో ఎండీ వెల్ల‌డించ‌గా, సంస్థ స్పందించిన తీరుపై నెటిజ‌న్లు, హైద‌రాబాదీలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక న‌ష్టాన్ని పూడ్చుకోవ‌డానికి మెట్రో ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. బతుకమ్మ పండుగ మొదలు సంక్రాంతి వరకు మెట్రో జర్నీపై 40 శాతం రాయితీని ప్రకటించి ప్రయాణికులకు బంఫర్‌ ఆఫర్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఒక్క‌రి కోసం ప్ర‌త్యేక రైలును న‌డిపిన మెట్రో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts