`మిస్ ఇండియా` ట్రైలర్: జగపతి బాబుకి చుక్క‌లు చూపించిన‌ కీర్తి!

October 24, 2020 at 12:30 pm

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్‌ ప్ర‌స్తుతం వ‌రుస ప్రోజెక్ట్‌ల‌ను లైన్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో `మిస్ ఇండియా` కూడా ఒక‌టి. నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మించారు. అయితే ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా నేడు మిస్ ఇండియా ట్రైల‌ర్ విడుద‌ల అయింది.

చిన్నతనం నుంచి బిజినెస్ చేసి ఎదగాలనే ఆలోచనలతో పెరిగిన మధ్య తరగతి అమ్మాయి సంయుక్త పాత్రలో కీర్తి సురేష్ క‌నిపిస్తోంది. బిజినెస్‌లో ఆమెను విలన్ (జగపతిబాబు) అణగదొక్కాలని అనుకోవడం.. ఆయన ప్లాన్స్‌ను కీర్తి సురేష్ తెలివిగా తిప్పి కొట్ట‌డం ఈ టీజ‌ర్‌లో చూపించారు. వ్యాపారం అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం’ అని జగపతి బాబు ఓ డైలాగ్ చెబుతాడు.

దానికి `ఈ ప్రాసెస్‌లో మీదాక వస్తానో.. లేదా మిమ్మల్నీ దాటేస్తానో..` అని కీర్తి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం బాగా ఆక‌ట్టుకుంటోంది. ఇక‌ జ‌గ‌ప‌తి బాబుకు కీర్తి సురేష్ చుక్క‌లు చూపించి తాను అనుకునేది సాధిస్తుంద‌ని టీజ‌ర్‌లో అర్థం అవుతుంది. మొత్తానికి ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా, ఈ చిత్రం త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో డైరక్ట్ డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, కమల్‌కామరాజు, సీనియర్‌ నరేశ్‌, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

`మిస్ ఇండియా` ట్రైలర్: జగపతి బాబుకి చుక్క‌లు చూపించిన‌ కీర్తి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts