చివరి 2 రోజులు ఆమెతో ఎంజాయ్ చేస్తున్న `మిస్‌ కాజల్‌`!

October 28, 2020 at 12:43 pm

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ముంబైకి చెందిన‌ బిజినెస్ మ్యాన్ గౌతమ్‌ కిచ్లుని అక్టోబర్‌ 30న పెళ్లాడనున్నట్టు ఇటీవ‌ల కాజ‌ల్ స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఇక ఇటీవ‌ల కాబోయే భర్తతో కాజ‌ల్‌ దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా కార‌ణంగా కుటుంబ సభ్యులు, అతి త‌క్కువ మంది అతిథుల‌ సమక్షంలో ఇంట్లోనే కాజ‌ల్ వివాహ వేడుక జరగనుంది. ఇక మ‌రో రెండు రోజుల్లోనే మిస్ కాజ‌ల్ నుంచి మిసెస్ కాజ‌ల్‌గా మార‌నుంది. ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. `మిస్ కాజల్ అగర్వాల్‌గా చివరి రెండు రోజులు. నా సోద‌రి నిషాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాన`ని కాజల్ పేర్కొంది.

ఈ క్ర‌మంలోనే నిషాతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. కాగా, పెళ్లి తర్వాత కూడా తన సినీ ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేసింది కాజ‌ల్‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు విష్ణు హీరోగా వస్తున్న మోసగాళ్లు, చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2, ముంబై సాగా లాంటి సినిమాల్లో న‌టిస్తోంది.

 

చివరి 2 రోజులు ఆమెతో ఎంజాయ్ చేస్తున్న `మిస్‌ కాజల్‌`!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts