పండుగ వేళ జాగ్రత్త అంటున్న మోదీ..!

October 20, 2020 at 6:51 pm

ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ ఆంక్షలు ముగిసినప్పటికీ కరోనా వైరస్ కథ ముగిసిపోలేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా సరే అతి శక్తివంతమైన ఆయుధం కేవలం టెస్టింగ్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చే వరకు మన పోరాటం బలహీన పడకూడదని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం చాలా మెరుగ్గా ఉన్నామని చెప్పుకొచ్చారు.

మరోవైపు కొన్ని దేశాలలో కరోనా కేసులు ఒకసారి తగ్గుముఖం పట్టినప్పటికీ, మళ్ళీ తిరిగి పెరగడం మొదలైందని తెలుపుతూ మనలో చాలామంది మన బాధ్యతలను తెలుసుకోవడం అవసరం అని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే మన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని.. జీవితాన్ని వేగవంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, అదే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనర్ధాలు జరుగుతాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా భారతదేశంలో పుంజుకుంటుందని వాక్షిన్ పరిశోధన కూడా భారత్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

పండుగ వేళ జాగ్రత్త అంటున్న మోదీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts