మోహన్ బాబు సినిమా ప్రారంభం.. టైటిల్ ఏంటో తెలుసా..?

October 23, 2020 at 2:22 pm

కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కొత్త సినిమా షూటింగ్ లను కూడా ప్రారంభిస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సినిమాకు సన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతో అటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇప్పటికీ 560 పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు తన వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించి విమర్శకుల ప్రశంసలు సైతం అనుకోని… ఎంతోమంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని నిలుపుకొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సారి సన్ ఆఫ్ ఇండియా అనే దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న చిత్రంలో మోహన్ బాబు నటన పిక్స్ లో ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

మోహన్ బాబు సినిమా ప్రారంభం.. టైటిల్ ఏంటో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts