ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో క‌లెక్ష‌న్ కింగ్?

October 18, 2020 at 2:17 pm

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాల ట్రెండ్ న‌డుస్తోంది. సీనియ‌ర్ హీరోల ద‌గ్గ‌ర నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు రీమేక్ చిత్రాల‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక తాజాగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూడా ఇదే దారిని ఎంచుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాలీవుడ్‌లో రతీష్‌ బాలకృష్ణన్‌ పొదువల్‌ తెరకెక్కించిన ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ రీమేక్ చిత్రంలో నటించేందుకు మోహన్ బాబు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌.

కాగా, 2019 సంవత్సరంలో విడుదలైన మాలీవుడ్ చిత్రం `ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25` భారీ విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని ఇటీవ‌ల తెలుగులో ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప 5.25’ టైటిల్ తో డబ్ చేసి ఆహాలో విడుదల చేసారు. ఈ చిత్రంలో సూరజ్ వెంజారమోద్‌, సౌబిన్ సాహిర్, కెండీ జిర్దో, సైజు కిరు తదితరులు కీతక పాత్రలు పోషించారు.

Android Kunjappan Version 5.25 film: Android Kunjappan Version 5.25 to have  TV premiere - Times of India

ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో క‌లెక్ష‌న్ కింగ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts