మ్యారీడ్ లైఫ్ అంటేనే వ‌ణుకుతున్న అఖిల్‌!

October 19, 2020 at 11:31 am

అక్కినేని వార‌సుడు అఖిల్‌.. మ్యారీడ్ లైఫ్ అంటేనే వ‌ణుకుతున్నాడు. అయితే ఇది రీయ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. ప్ర‌స్తుతం నాలుగో ప్రయత్నంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు

తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో `హాయ్‌.. ఐ యామ్‌ హర్ష. ఒకబ్బాయి లైఫ్‌లో 50శాతం కెరీర్‌, మరో 50 శాతం మ్యారీడ్‌ లైఫ్‌. కెరీర్‌ని సూపర్‌గా సెట్‌ చేశా. కానీ ఈ మ్యారీడ్‌ లైఫే.. అంటూ ఒంటికాలిపై నిలబడి రెండు చేతులు చాచి అయ్యయ్యో` అని వ‌ణికుతున్నాడు. ప్ర‌స్తుతం హ‌ర్ష మ్యారీడ్ లైఫ్ గురించి ఎందుకంత టెన్ష‌న్ ప‌డుతున్నాడో తెలియాలంటే.. అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల వరకు వేచి చూడాల్సిందే.

ఎందుకంటే, అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీజ‌ర్ విడుద‌ల కానుంది. కాగా, ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న అఖిల్‌.. ఈచిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు.

మ్యారీడ్ లైఫ్ అంటేనే వ‌ణుకుతున్న అఖిల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts