`మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` టీజర్ వ‌చ్చేసింది.. అఖిల్‌కు హిట్ ఖాయ‌మా?

October 25, 2020 at 12:49 pm

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం `మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ రోజు ద‌స‌రా సంద‌ర్భంగా.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్ టీజర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

మ్యారీడ్‌ లైఫ్ నుండి మీరేం ఆశిస్తున్నారు అని అఖిల్ అడుగుతుండ‌డంతో టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. అందుకు కేరింగ్ హస్బెండ్ అని ఒక అమ్మాయి‌, అన్నీ పనులు షేర్‌ చేసుకోవాలి అని ఒక అమ్మాయి, నాకు జాయింట్‌ ఫ్యామలీ అంటే చిరాకు అని ఒక అమ్మాయి, ల‌వ్‌ లవ్‌ లవ్‌ లవ్‌ లవ్ ఇంకేముంటుందండి మ్యారీడ్‌ లైఫ్‌లో అని ఒక అమ్మాయి చెబుతారు. అయితే చివ‌ర‌కు ‘నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం’ అని చెప్పే పూజా అఖిల్‌కు దొరుకుంది.

మ‌రి వీరి ప్రేమ ఎలా సాగింది.. ఎలా స‌క్సెస్ అయింది.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి అన్న‌వి తెలియాలంటే 2021 సంక్రాంతి వరకు ఆగాల్సిందే. మొత్తానికి టీజ‌ర్ అద్భుతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇక ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసి ఘోరంగా విఫ‌ల‌మైన అఖిల్‌.. ఈ సినిమాతో హిట్ ఖాయమ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీజ‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

`మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్` టీజర్ వ‌చ్చేసింది.. అఖిల్‌కు హిట్ ఖాయ‌మా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts