రేపే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ విడుదల..!

October 24, 2020 at 5:24 pm

అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా రాబోతున్న విష‌యం అందరికి తెలిసిందే.ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న అందాల భామ పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమానకు బోమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.జీఏ2 పిశ్చ‌ర్స్ ప‌తాకంపై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.వ‌చ్చే ఏడాది సంక్రాంతి కనుకుగా ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు మూవీ యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది.ఈ క్ర‌మంలో ఈ సినిమాను టీజర్ ను రేపు ఉదయం 11.40 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ యూనిట్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది. ఈ టీజర్ త‌ప్ప‌నిస‌రిగా అంద‌రినీ అల‌రిస్తుంద‌ని సినిమా యూనిట్ స్ప‌ష్టం చేసింది.ఈ సినిమాపై అక్కినేని అఖిల్ అభిమానులు కూడా భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్ విజ‌యాన్ని అందుకుంటాడా లేదా అని తెలియాలంటే,పండుగ వరుకు వేచి చూడాల్సిందే.

రేపే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts