మౌన దీక్ష చేసిన ముఖ్యమంత్రి..!

October 19, 2020 at 2:48 pm

ఇటీవలే మధ్య ప్రదేశ్ లో ఉప ఎన్నిక కోసం ప్రచారంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థి పై కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక కమల్ నాథ్ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. మధ్యప్రదేశ్ లోని దబ్రా నియోజకవర్గంలో ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచార సభలో పాల్గొన్న కమల్నాథ్… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంతో సాదాసీదా వ్యక్తి అంటూ తెలిపిన ఆయన బిజెపి అభ్యర్థి గురించి అందరికీ తెలిసిన విషయమే… ఆమె ఒక ఐటమ్ అంటూ కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది.

కనీసం ఆమె పేరు పలకడానికి కూడా తనకు నచ్చడం లేదు అంటూ కమల్నాథ్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కమల్నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఇక ఇటీవల దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… బీజేపీ అభ్యర్థి ఇమ్మర్తి దేవి ఒక పేద రైతు ఇంట్లో పుట్టిన బిడ్డ అని… ఒక మహిళను పట్టుకొని ఐటం అంటూ వ్యాఖ్యానించిన మాజీ ముఖ్య మంత్రి కమల్నాథ్ ఫ్యూడల్ మైండ్ సెట్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తో పాటు మరికొంతమంది కూడా మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఓ దళితురాలిని కావడం వల్ల తనపై ఇలాంటి కామెంట్లు చేస్తారా అంటూ సోనియా గాంధీని ప్రశ్నించారు ఇమ్మర్తి దేవి.

మౌన దీక్ష చేసిన ముఖ్యమంత్రి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts