‘జగన్ అనే నేను’…ఏపీలో నవ్వినా ఫైన్…

October 23, 2020 at 3:08 pm

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై సెటైర్ల వర్షం కురిపించారు. భరత్ అనే నేను సినిమా మాదిరిగా జగన్ ఏపీలో ట్రాఫిక్ ఫైన్స్ పెంచడంపై రాజుగారు మండిపడ్డారు. ఇకపై ప్రతి వెహికిల్‌ను పోలీసులు ఆపేస్తారని, మీరు విసుక్కున్నా.. కసురుకున్నా… ఫైన్ వేస్తారని, మొహం చిట్లిస్తే … 1500…  మీరు నవ్వినా ఏసేస్తారు’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ఇక అమరావతిలో రైతుల నిరసన అద్భుతంగా జరిగిందని, పెయిడ్ అర్టిస్టులని అవమానించిన వారికి.. చెంపపెట్టులా రాజధాని రైతులు నిరసన తెలిపారన్నారు. రాజధాని మహిళా రైతుల చీరలు, జాకెట్లపై నీచంగా, హీనంగా, హేళనగా మాట్లాడిన వారిని క్షమించి వదిలేయండమ్మా అని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఇక ఉద్యమాన్ని బలపరచాలి.. కానీ కించపర్చొద్దన్నారు. మొత్తానికైతే రఘురామ ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

‘జగన్ అనే నేను’…ఏపీలో నవ్వినా ఫైన్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts