ముక్కుపచ్చలారని శిశువు నడిరోడ్డుపై వదిలేసారు.. చివరికి..?

October 24, 2020 at 2:48 pm

ఈ మధ్య కాలంలో అసలు మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది. నవమాసాలు మోసి రక్తాన్ని ధారబోసిన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలకు సైతం కనీస విలువ ఇవ్వడం లేదు ఎంతోమంది మహిళలు. అప్పుడే పుట్టిన చిన్నారులను నడిరోడ్డు మీద కనీసం జాలి దయ అనేది లేకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముక్కుపచ్చలారని పసికందును నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు.

మూసాపేట లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. బొడ్డు తాడు తో ఉన్న పసికందు వద్దకు కుమారి అనే మహిళ వెళ్లి చేరదీసింది. అనంతరం ఆసుపత్రి కీ చికిత్స కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది మహిళ. పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తీసుకువచ్చి సదరు శిశువును అక్కడ నడిరోడ్డుపై వదిలేసినట్లు స్థానికురాలు కుమారి పోలీసులకు వివరాలు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముక్కుపచ్చలారని శిశువు నడిరోడ్డుపై వదిలేసారు.. చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts