
ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా నిన్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విషయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక కోల్‌కతా తమ ముందుంచిన 149 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకునేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడు మొదలుపెట్టింది.
ఓపెనర్లు రోహిత్‌శర్మ క్వింటన్ డికాక్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, డికాక్‌లు కలిసి వీర విహారం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. చివరకు ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 19 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించింది.
ఎనిమిదో మ్యాచ్ ఆడిన ముంబయి ఆరో గెలుపుతో పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్ స్థానానికి దూసుకువెళ్లింది. నాలుగో ఓటమితో కోల్‌కతా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముంబయితో మ్యాచ్‌కి కొన్ని గంట ముందు కోల్‌కతా కెప్టెన్సీ నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకోగా.. ఇయాన్ మోర్గాన్ పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ మారిన కోల్‌కతా జట్టును విజయం వరించలేదు.