ఓడిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్‌లో ముంబై!

October 29, 2020 at 7:21 am

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి స్టేడియం వేదిక‌గా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముండై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించి ఫ్లే ఆఫ్స్‌లోకి ఆడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 11 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 90 పరుగులు దాటడంతో భారీ స్కోరు చేస్తుందని భావించారు.

అయితే, కెప్టెన్ కోహ్లీ (9) అవుటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. వికెట్లను వెంటవెంటనే చేజార్జుకుంది. అయితే చివ‌ర‌కు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. బెంగళూరు నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది.

సూర్యకుమార్ 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. వికెట్లు పడుతున్నా..సూర్య కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక తాజా సీజన్‌లో 12వ మ్యాచ్ ఆడిన ముంబయికి ఇది ఎనిమిదో గెలుపుకాగా.. బెంగళూరుకి ఇది ఐదో ఓటమి. ఈ గెలుపుతో ముంబై ఫ్లే ఆఫ్స్‌కు చేర‌డం ఖాయం చేసుకుంది. ఇక పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఓడిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్‌లో ముంబై!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts