అంధ‌కారంలో ముంబై మ‌హాన‌గ‌రం

October 12, 2020 at 11:38 am

విద్యుత్ లేకుండా ప‌రిస్థితి ఊహించుకోండి. అది సాధ్య‌మే కాదు. క‌రెంటు లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండ‌లేని ప‌రిస్థితి. అలాంటిది దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై యావ‌త్ ప్ర‌స్తుతం అంధ‌కారంలో మ‌గ్గుతున్న‌ది. దీంతో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు నిలిచిపోయి ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు పుడుతున్నారు. ముంబై మ‌హ‌న‌గారానికి ప‌వ‌ర్ స‌ప్ల‌య్ చేసే టాటా ఇన్‌క‌మింగ్ ప‌వ‌ర్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ఎక్క‌డిక‌క్క‌డ విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇప్ప‌టికే సుమారు రెండు గంట‌కు పైగా క‌రెంటు లేక‌పోవ‌డంతో ముంబైవాసులు అల్లాడిపోతున్నారు.

ఇక విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో ఒక‌వైపు స‌బ‌ర్ప‌న్ రైళ్లు నిలిచిపోయాయి. మ‌రోవైపు ట్రాఫిక్ సిగ్న‌ళ్లు స్తంభించిపోవ‌డంతో రాక‌పోక‌లు అస్త‌వ్య‌స్తంగా మారాయి. ప‌లుచోట్ల ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. అదేవిధంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో పౌర సేవ‌లు కూడా నిలిచిపోయాయి. బ్యాంకుల లావాదేవీల‌కు ఆటంకం ఏర్ప‌డింది. అదేవిధంగా అనేక కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు కూడా న‌డ‌వ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. మ‌హాన‌గ‌రం మొత్తంగా అంధ‌కారం కావ‌డంతో పాటు, ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా స్తంభించిపోయింది. ఇదిలా ఉండ‌గా అధికారులు వేరొక ప‌వ‌ర్ గ్రిడ్ నుంచి కొన్ని అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు సంబంధించిన క‌రెంట్‌ను అందిస్తున్నారు. మ‌రోవైపు సాంకేతిక లోపాన్ని స‌వ‌రించేందుకు అధికారులు నిమ‌గ్న‌మై ఉన్నారు.

అంధ‌కారంలో ముంబై మ‌హాన‌గ‌రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts