పిల్ల‌ల విష‌యంలో సామ్‌కు చైతూ వార్నింగ్‌?

October 29, 2020 at 9:27 am

టాలీవుడ్ స్వీట్ & క్యూట్ క‌పులు నాగ చైత‌న్య‌-స‌మంత గురించి ప్ర‌త్యకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు ఎంద‌రో అభిమానులు ఉన్నారు. ఇక ఈ జంట పెళ్లి తరువాత కూడా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సామ్‌-చైతూకు పెళ్లై మూడేళ్లు అవుతున్నా.. పిల్ల‌ల ఊసే ఎత్త‌డం లేదు.

మ‌రోవైపు అభిమానులు మాత్రం వీరి నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇక సమంతను ఎంతో మంది ఎన్నో సార్లు తల్లి ఎప్పుడు కాబోతున్నారు అంటూ ప్రశ్నించారు. కానీ, స‌మంత మాత్రం త‌న‌దైన శైలిలో జ‌వాబు ఇస్తూ ఉండేది. అయితే తాజాగా చైతూ పిల్ల‌ల విష‌యంలో సామ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. విష‌యం ఏంటంటే.. వీరిద్ద‌రూ మింత్ర యాడ్ లో నటించారు.

యాడ్ లో భాగంగా మింత్ర లో చైతూ నాన్నకు కుర్తా.. తమ్ముడికి స్టైలిష్ డ్రస్.. అమ్మకు చీర అంటూ ఎంపిక చేస్తుండగా ఫోన్ ను సమంత తీసుకుని పిల్లల సెక్షన్ కు వెళ్లి ఈ డ్రస్ చూడండి ఎంత బాగుందో అని అంటూ సిగ్గు పడుతూ ఉంటుంది. దాంతో చైతూ అలాంటి ఆలోచన ఇప్పుడేం పెట్టుకోకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇవ్వ‌డం.. సమంత ఎందుకు అలా అంటూ రొమాంటిక్ గా చూడ‌డం అభిమానులు తెగ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి మీరు చూసేయండి.

 

పిల్ల‌ల విష‌యంలో సామ్‌కు చైతూ వార్నింగ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts