సమంతకు షాక్ ఇచ్చిన చైతు..!?

October 28, 2020 at 6:01 pm

టాలీవుడ్ లో ప్రేమించుకుని పెళ్లాడిన జంటల్లో టాప్ జంట ఎవరంటే  సమంత చైతన్య. ఈ జంట అంటే అందరికి భలే ఇష్టం. వీరిద్దరూ పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేస్తున్నారు. మరి పెళ్లి అయ్యాక పిల్లలు గురించి ఆలోచించాలి కదా.. సమంత చైతన్యలు ఎప్పుడు శుభవార్త చెబుతారా అని ఎదురుచూసే అభిమానులకు వీరిరువురు ఓ క్లారిటీ ఇచ్చేసారు. తాము ఇప్పుడే తల్లిదండ్రులు కావాలని అనుకోవడం లేదని చెప్పకనే చెప్పేశాడు చైతన్య. వివరాలలోకి వెళితే తాజాగా ఈ ఇద్దరూ మింత్ర అనే యాప్ కోసం ఒక ప్రకటనలో నటించారు.

 

ఇందులో అన్ని వయస్సుల వారికి అన్ని రకాల డిజైనర్ బ్రాండెడ్ దుస్తులు లభిస్తాయని చెబుతూ ప్రకటన మొదలవుతుంది.తర్వాత పండుగ కోసం తాను షాపింగ్ చేస్తానని సమంత చెబితే వద్దని చైతన్య అంటాడు. నేనే చేస్తాను అంటూ మింత్ర యాప్ ఓపెన్ చేసి నాన్నకు ఈ డ్రెస్ బాగుంటుంది.. తమ్ముడికి ఇది బాగుంటుంది.. అమ్మకు ఈ చీర బాగుటుంది అని చైతు అంటుంటే వెంటనే ఫోన్ తీసుకుంటుంది సమంత. అమ్మకు ఈ కలర్ ఫేవరేట్ అంటూ చెప్పేస్తుంది. ఇక తరువాత ఏముంది కిడ్స్ డ్రెస్సులు వస్తాయి. దీంతో నాగచైతన్య సమంతను అదోలా చూస్తాడు. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకు అనేస్తాడు. అంటే ఇప్పుడే పిల్లలు కనే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పేశాడు అని సోషల్ మీడియాలో టాక్.. !!

సమంతకు షాక్ ఇచ్చిన చైతు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts