నిహారిక మ్యారెజ్‌‌ ఎప్పుడో చెప్పేసిన‌‌ నాగ‌బాబు.. పెళ్లి పనుల్లో అత‌డు బిజీబిజీ!

October 17, 2020 at 3:43 pm

మెగా డాట‌ర్ నిహారిక త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఆగస్టు 13న చైతన్య, నిహారిక‌ల నిశ్చితార్థం కూడా జ‌రిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. అయితే నిశ్చితార్థం జ‌రిగింది గాని.. పెళ్లి ఎప్పుడు మాత్రం చెప్ప‌లేదు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన నాగ‌బాబు.. నిహారిక పెళ్లికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. నిహారిక పెళ్లి జరుగుతుండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని నాగబాబు చెప్పారు. ఇలాంటి కఠిన సమయంలో నిహారిక పెళ్లి కొంత ఉపశమనం కలిగిస్తోంద‌ని అన్నారు.

నిహారిక పెళ్లి డిసెంబర్ లో చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. వరుణ్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల జాబితాను తయారు చేశాడు. వాటిలో ఏదో ఒక‌టి ఫిక్స్ చేస్తామ‌ని.. మ‌రియు పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తామని నాగ‌బాబు చెప్పుకొచ్చారు. ఇక పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌లో తన కుమారుడు వరుణ్ తేజ్ బిజీగా ఉన్నాడ‌ని తెలిపారు. మొత్తానికి నిహారిక పెళ్లి డిసెంబ‌ర్‌లో ఉండ‌నుంద‌ని తేలిపోయింది.

నిహారిక మ్యారెజ్‌‌ ఎప్పుడో చెప్పేసిన‌‌ నాగ‌బాబు.. పెళ్లి పనుల్లో అత‌డు బిజీబిజీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts