స‌మంత‌ను సైడ్ చేస్తున్న నాగార్జున‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!

October 29, 2020 at 11:10 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 ఎనిమిదో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎనిమిది మంది ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌నున్నారు. అయితే గ‌త వారం నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మ‌నాలి వెల్ల‌గా.. ఆయ‌న స్థానంలో సమంత అక్కినేని వ‌చ్చి సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. నాగార్జున ప్లేస్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన సమంత అద‌రిగొట్టింద‌నే చెప్పాలి.

తన యాంకరింగ్‌తో ఎక్కడ బోర్ కొట్టించకుండా… అటు హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియన్స్ నుంచి మంచి మార్కులే కొట్టేసి మామ‌కు త‌గ్గా కోడ‌ల‌నిపించుకుంది. షో సాగినంత సేపు సమంత కాన్ఫిడెన్స్ చూసి ఆమెకు హోస్ట్‌గా మొదటి ఎపిసోడ్ అంటే న‌మ్మ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. మొత్తానికి ప్రేక్ష‌కుల నుంచి స‌మంత‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో ఈ వచ్చే వారాంతం కూడా సమంత‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. నాగార్జున్ స‌మంత‌ను సైడ్ చేయ‌నున్నార‌ట‌. అంటే ఈసారి తిరిగి నాగార్జునే యథావిధిగా హోస్టింగ్ చేయనున్నార‌ట‌. అయితే ఈ వారం కూడా హోస్ట్‌గా స‌మంత వ‌స్తుంద‌ని భావించిన ఫ్యాన్స్‌కు ఇది కాస్త షాక‌నే చెప్పాలి.

స‌మంత‌ను సైడ్ చేస్తున్న నాగార్జున‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts