థాయిలాండ్‌కు నాగార్జున‌.. రిస్క్ తీసుకుంటున్నాడా?

October 4, 2020 at 10:39 am

ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన కింగ్ నాగార్జున.. ప్ర‌స్తుతం అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ 70శాతం పూర్తయింది. కరోనా కారణముగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ను త్వ‌ర‌లోనే నాగార్జున ప్రారంభించారు. అయితే ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలు చిత్ర యూనిట్స్ ఇతర దేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఇపుడు వైల్డ్ డాగ్ యూనిట్ కూడా ఎప్పటి నుంచో ఆగిపోయిన ఓ షెడ్యూల్ ను థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అంటే త్వ‌ర‌లోనే నాగార్జున థాయిలాండ్ వెళ్లునున్నార‌ట‌. అయితే ఈ క‌రోనా స‌మ‌యంలో థాయిలాండ్‌లో షూటింగ్ అంటే రిస్క్‌తో కూడుకున్న ప‌నే అని చెప్పాలి. మ‌రి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. కాగా, నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

థాయిలాండ్‌కు నాగార్జున‌.. రిస్క్ తీసుకుంటున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts