నకిలీ విత్తనాలతో మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే..?

October 26, 2020 at 5:41 pm

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా నకిలీ విత్తనాల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. రైతులు ఎంతో కష్టపడి పంట వేసినప్పటికీ నకిలీ విత్తనాల కారణంగా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక పంట కూడా పెరగక చివరికి తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అటు అధికారులు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికి … నకిలీ విత్తనాల బెడద రైతులకు తప్పడం లేదు అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు రైతులు నకిలీ విత్తనాల ద్వారా నష్టపోవడం చూశాము కానీ ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నకిలీ విత్తనాలు కారణంగా మోసపోయాడు.

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నకిలీ విత్తనాల కంపెనీ చేతిలో మోసపోయారు . 14 ఎకరాల్లో ఎమ్మెల్యే పంట వేయగా ఏకంగా ఐదు ఎకరాల్లో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మోసపోవడం తో అందరూ షాక్ అవుతున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పంట నష్టం ఏర్పడడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

నకిలీ విత్తనాలతో మోసపోయిన మంగళగిరి ఎమ్మెల్యే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts