నలుగురు పిల్లలను దారుణంగా నరికేశారు.. ఎక్కడంటే..?

October 16, 2020 at 7:05 pm

ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలకే చివరికి దారుణంగా మనుషుల ప్రాణాలు తీస్తు హత్యలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి దారుణం ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికులు అందరి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసుకుంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లో వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోర్ఖేదా లో మూడేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగిన నలుగురు చిన్నారులను దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. మెహతాబ్, రుమాలి దంపతుల నలుగురు పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి కూలి పనుల నిమిత్తం తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు నలుగురు చిన్నారులు దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఆ తర్వాత రక్తపు మడుగులో పడిఉన్న చిన్నారులను చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు అంబులెన్స్ కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురు పిల్లలను దారుణంగా నరికేశారు.. ఎక్కడంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts