సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నా నమ్రత పోస్ట్..!

October 28, 2020 at 4:50 pm

సూపర్ స్టార్ మహేష్ బాబును ఎప్పుడు కూడా గడ్డం, మీసాలతో చూడటం చాలా అరుదు. ఎప్పుడూ కూడా మహేష్ బాబు క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు.కానీ మహర్షి సినిమా కోసం మాత్రం ఫస్ట్ హాఫ్ లో గడ్డాన్ని పెంచాడు. అలాగే భరత్ అనే నేను చిత్రంలో కూడా ఓ సీన్‌లో మహేష్ బాబు పెట్టుడు మీసాలతో ఒక పాటలో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు ఈ మీసం, గడ్డం గోల ఏంటా అనుకుంటున్నారా.. కారణము ఉంది అండి. మళ్ళీ ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మీసం కట్టులో కనిపించాడు. సినిమాలో కాదండోయ్.. ఒక యాడ్ షూటింగ్ కోసం అన్నమాట. ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ సేల్‌లో మహేష్ బాబు డబల్ రోల్ చేశాడు. అందులో ఓ పాత్రకు మహేష్ బాబు మీసంకట్టుతో కనిపించి అందరిని ఆకర్షించాడు.

అయితే ఆ పాత్ర కోసం, ఆ లుక్ కోసం మహేష్ బ పడిన కష్టాలను తాజాగా నమ్రత షేర్ చేసింది. కొన్ని యాడ్స్ నిజంగా అనిపించవు.. మరీ ముఖ్యంగా ఈ మీసం కట్టు లుక్కులో. షూటింగ్ అంటే కచ్చితంగా సౌకర్యవంతంగా ఉండాలని, అలాగే సరదాగానే ఉండాలన్న నియమం ఏమీ లేదు.. అయితే మన వైపు దృఢ నమ్మకం అనేది ఉంటే ఎలాంటి చాలెంజింగ్ పనులైనా సరే ఇట్టే జజరిగిపోతుంటాయి అని మేకప్ ఆర్టిస్ట్ పట్టాబి, డీఓపీ బోస్ గురించి నమత్ర తెలిపారు.. !!

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నా నమ్రత పోస్ట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts