వైసీపీని వ‌ద‌ల‌ని క‌రోనా.. మ‌రో ఎమ్మెల్యేకు సోకిన వైర‌స్‌?

October 6, 2020 at 7:25 am

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల మందికిపైగా మృతి చెందారు. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. రోజురోజుకు క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీని క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు. ఇప్ప‌టికే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీల‌క నేత‌లు క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా సోకింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్​కు కరోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

Nandikotkur MLA likely to tender resignation to YSR Congress party

ఈ నెల 2వ తేదీన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. దీంతో క‌రోనా సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులతో కలిసి టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మనవడికి సైతం పాజిటివ్​ అని తేలింది. ప్ర‌స్తుతం వీరు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

వైసీపీని వ‌ద‌ల‌ని క‌రోనా.. మ‌రో ఎమ్మెల్యేకు సోకిన వైర‌స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts