`టక్ జగదీష్`కు క‌రోనా క‌ష్టాలు.. ఆగిపోయిన షూటింగ్‌?

October 18, 2020 at 10:28 am

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అన్ని దేశాలు అత‌లాకుత‌లం అయ్యాయి. ఇక తాజాగా ఈ క‌రోనా సెగ నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమాకు త‌గిలిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వి త‌ర్వాత నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. రోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.

అయితే ప్ర‌భుత్వం స‌డలింపులు ఇవ్వ‌డంతో.. ట‌క్ జ‌గ‌దీష్ టీమ్ మ‌ళ్లీ రంగంలోకి దిగి ఇటీవ‌లె షూటింగ్ ప్రారంభించారు. నాని, రీతూ వర్మ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు యూనిట్ లోని ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, దీనిపై చిత్ర టీమ్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

`టక్ జగదీష్`కు క‌రోనా క‌ష్టాలు.. ఆగిపోయిన షూటింగ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts