బాబోయ్ చినబాబు ఫైర్…ఆ అప్పులు ఎటువెళుతున్నాయి…

October 14, 2020 at 11:37 am

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎప్పటిలానే ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చినబాబు ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

“రాష్ట్రంలో మెట్ట రైతుల కంట కన్నీటి వరద ప్రవహిస్తోంది. అధిక వర్షాలు, వరదలకు పత్తి, వేరుశెనగ, మిర్చి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు బాగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్ట పోయారు. రిజర్వ్ బ్యాంకు ఖజానా ఖాళీ అయ్యేంతగా అప్పులు దూసి తెస్తున్న జగన్ ప్రభుత్వం ఇంతవరకూ రైతులకు రూపాయి కూడా సాయం చేసింది లేదు. ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో చేసుకుంటున్నారు. తీసుకొస్తున్న వేల కోట్ల అప్పులు ఎటుపోతున్నాయో రైతులకు తెలియడం లేదు. ఇప్పటికయినా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోండి. వాళ్ళ కష్టాలు కాస్త  ఆలకించండి ముఖ్యమంత్రి గారూ!!   అంటూ చినబాబు ట్వీట్ చేశారు.

బాబోయ్ చినబాబు ఫైర్…ఆ అప్పులు ఎటువెళుతున్నాయి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts