నారప్ప కు అంతా సిద్ధం..?

October 17, 2020 at 6:20 pm

గత కొన్నేళ్ల నుంచి విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ అభిమానులు అందరూ సోలో హీరో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలోనే తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ లో వెంకటేష్ నటించబోతున్న విషయం తెలిసిందే. ధనుష్ హీరోగా రా కంటెంట్ మూవీ గా యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన అసూరన్ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటిస్తుండగా ఈ సినిమాకు నారప్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకోగా.. కొంత బాధ మిగిలి ఉంది అనుకున్న సమయంలో లాక్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా షూటింగ్ లకు అనుమతి వచ్చిన నేపథ్యంలో మళ్లీ నారప్ప షూటింగ్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది వెంకటేష్ అభిమానులందరికీ శుభవార్త అని చెప్పాలి.

నారప్ప కు అంతా సిద్ధం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts