నష్టం అంచనా వేయకుండా నిధులు ఎలా ఇస్తాం..?

October 21, 2020 at 6:14 pm

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక భారీ వర్షాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తక్షణ సహాయం కింద నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఈ క్రమంలోనే తెలంగాణ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నష్టం ఎంత జరిగింది అన్నది అంచనా వేయకుండా నిధులు ఎలా మంజూరు చేస్తాము అంటూ తెలిపారు. కేంద్రం సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు అంటూ తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేయడం అవాస్తవం అంటూ తెలిపిన కిషన్ రెడ్డి.. నష్టం అంచనా వేయకుండా నిధులు ఇచ్చే పద్ధతి ఎన్నడు పాటించలేదు అంటూ తెలిపారు. కేంద్ర బృందాలు రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రం నుంచి వరద సహాయనిధి అందుతుందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

నష్టం అంచనా వేయకుండా నిధులు ఎలా ఇస్తాం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts